ధనుష్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం సార్ . టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్‌మెంట్స్-ఫార్చూన్ ఫోర్ సినిమాస్ శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో మలయాళ నటి సంయుక్తామీనన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోండగా, డైలాగ్ కింగ్ సాయికుమార్, తనికెళ్లభరణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఈ చిత్రం నుంచి బంజారా పాటను లాంఛ్ చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడగా, సుద్దాల అశోక్ తేజ రాశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మాస్టారు (తెలుగు వెర్షన్), వావాథి (తమిళంలో) సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. ధనుష్ నటిస్తోన్న స్ట్రెయిట్ తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్, సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, నిర్మాతలు: నాగవంశీ ఎస్, సాయిసౌజన్య, రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి.














