కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై ప్రమాణ స్వీకారం చేశారు. బెంగుళూరులో ఉన్న రాజ్‌భవన్‌లో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కర్నాటక రాష్ట్ర 23వ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎస్‌ఆర్ బొమ్మై తనయుడే బసవరాజు బొమ్మై. బసవరాజు బొమ్మై వయసు 61 ఏళ్లు. కర్నాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ బొమ్మైతో ప్రమాణ స్వీకారం చేయించారు. లింగాయత్ సామాజిక వర్గానికి మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. యడియూరప్ప వారసుడిగా ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న బసవరాజు వైపే బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపిన సంగతి తెలిసిందే.