Namaste NRI

 నేపాల్‌లో ఘటన మరవకముందే..  అమెరికాలో

 నేపాల్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన మరవకముందే,  అమెరికాలోని టెక్సాస్లో ఓ చిన్న సైజు విమానం కుప్పకూలింది. విక్టోరియా యోకుమ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో ఐదుగురు ఉన్నట్లు తెలిపారు. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా,  ఒకరికి తీవ్రంగా గాయాలైనట్లు చెప్పారు. మృతులు బిల్ గార్నర్, స్టీవ్ టక్కర్, టైలర్ ప్యాటర్సన్, టైలర్ స్ప్రంగర్లుగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన పాస్టర్ కెన్నన్ వాఘన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా జర్మన్టౌన్లోని మెంఫిస్ శివారులోని ఓ చర్చికి చెందిన వారుగా అధికారులు గుర్తించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events