రోదసీలోకి విజయవంతంగా తిరిగొచ్చాకా అమెరికా పారిశ్రామికవేత్త, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఒక కొత్త అవార్డును ప్రకటించారు. ప్రఖ్యాత చెఫ్ జోస్ ఆండ్రీస్, అమెరికాలో రాజకీయ వార్తల వ్యాఖ్యాత వాన్ జోన్స్లకు ఈ అవార్డు దక్కింది. కరేజ్ అండ్ సివిలిటీ పేరిట ఇచ్చే ఈ అవార్డుతో పాటు వీరిద్దరూ దాదాపు చెరో రూ.745 కోట్ల (10 కోట్ల డాలర్లు) నగదు పురస్కారం అందుకోనున్నారు. మానవాళి ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పోరాడటంతో అవిశ్రాంత కృషి చేస్తున్నందుకు అవార్డును ప్రకటించినట్లు బెజోస్ చెప్పారు. నగదు పురస్కారంగా పొందే ఈ మొత్తాన్ని గ్రహీతలు తమ సొంత అవసరాలకు వాడుకోవచ్చు లేదా స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వవచ్చు. ఆండ్రీస్ ప్రఖ్యాత పాకశాస్త్ర ప్రవీణుడు, 2021లో లాభాపేక్షలేని వరల్డ్ సెంట్రల్ కిచెన్ అనే సంస్థను స్థాపించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన చోట్ల భోజన వసతులు కల్పిస్తున్నారు.