Namaste NRI

భైరవం థీమ్ సాంగ్ రిలీజ్

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటిస్తున్న చిత్రం భైరవం. విజయ్ కనకమేడల దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత. సమ్మర్ లో సినిమా విడుదల కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పం దన వస్తున్నదని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలోని భైరవం థీమ్ సాంగ్ ని విడుదల చేశారు. రానున్న మహాశివరాత్రి పర్వదినం సందర్భం గా విడుదలైన ఈ ఆధ్యాత్మిక గీతం అత్యంత శక్తిమంతంగా ఉద్వేగపూరితంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. చైతన్య ప్రసాద్ రాసిన ఈ గీతాన్ని శ్రీచరణ్ పాకాల స్వరపరచగా, శంకర్ మహదేవన్ ఆలపించారు.
శంకర్ మహదేవన్ గాత్రం ఈ పాటలో తెలియని గొప్ప శక్తిని నింపిందని, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కూడా అద్భతంగా అభినయించారని, శివతత్వంలోని గొప్పతనాన్ని ఈ గీతం ఆవిష్కరిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఓ ఆలయం ముందు ఈ పాటను చిత్రీకరించారు. నారా రోహిత్, మంచు మనోజ్, అదితి శంకర్, దివ్య పిైళ్లె కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: సత్యర్షి, తూమ్ వెంకట్, కెమెరా: హరి కె.వేందాంతం, నిర్మాణం: శ్రీసత్యసాయి ఆర్ట్స్.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events