సుహాస్, మాళవిక మనోజ్ జంటగా నటిస్తున్న చిత్రం ఓ భామ అయ్యో రామ. ఈ చిత్రానికి రామ్ గోధల దర్శకుడు. హరీశ్ నల్ల నిర్మాత. ఈ వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ వెండితెరపై అతిథి పాత్రలో మెరవనున్నారు. ఆయన కీలకమైన గెస్ట్ రోల్ ను పోషించారు. హరీశ్ శంకర్ అతిథి పాత్ర అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ పాత్ర ఆయన చేస్తేనే బాగుంటుందని భావించాం. హరీశ్ శంకర్ కు సంబంధించిన సన్నివేశాలను ఇటీవలే పూర్తి చేశాం. ఆద్యంతం వినోదంతో ఆకట్టుకునే చిత్రమిది అని మేకర్స్ తెలిపారు. అనితా హసనందిని, అలీ, పృథ్వీరాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్, రచన-దర్శకత్వం: రామ్ గోధల.
