Skip to main content

Namaste NRI

బుజ్జీ ఇలా రా అంటున్న ధన్ రాజ్.. భయపెడుతున్న టీజర్

సునీల్‌, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న  లేటెస్ట్‌ మూవీ బుజ్జీ ఇలారా. చాందిని అయ్యంగార్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎన్‌ఎస్‌ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్‌పి, జి.నాగేశ్వర రెడ్డి టీమ్‌ వర్క్స్‌ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ రెడ్డి నిర్మాస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నిర్మాతలు మాట్లాడుతూ ఈ సినిమాకు కర్త కర్మ క్రియ అన్నీ కూడా మా అన్న జి.నాగేశ్వరరెడ్డి. డైరెక్టర్‌ అంజీ అద్భుతంగా సినిమాను తీశారు అని అన్నారు. జి.నాగేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రం కోసం ధన్‌రాజ్‌ ఎన్నో త్యాగాలు చేశాడు. అతని కష్టానికి ప్రేక్షకులు మంచి విజయాన్ని అందిస్తారు అని అన్నారు. కార్యక్రమంలో కోన వెంకట్‌, బి.వి.ఎస్‌.రవి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News