Skip to main content

Namaste NRI

బైడెన్ రక్షణ సిబ్బందిని మూడు నెలల్లోనే.. పది సార్లు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పెంపుడు శునకం కమాండర్  అధ్యక్షుడి రక్షణ సిబ్బందిపై విరుచుకుపడుతోంది. మూడు నెలల్లో ఏకంగా పది సార్లు సీక్రెట్ సర్వీస్ అధికారులను  కరిచింది. ఈ విషయాన్ని శ్వేత సౌధం కూడా అంగీకరించింది.  బైడెన్ కు చెందిన కమాండర్ 2022 అక్టోబరు నుంచి 2023 జనవరి మధ్య కనీసం పది సార్లు సీక్రెట్ సర్వీస్ అధికారులను కరిచింది. కమాండర్ దాడిలో గాయపడిన ఒకరిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స కూడా అందించినట్లు వెల్లడించింది. ఈ కమాండర్ శునకం జర్మన్ షెపర్డ్ జాతికి చెందినదిగా తెలిపింది. ఈ శునకాన్ని బైడెన్ కు ఆయన సోదరుడు జేమ్స్ కానుగా ఇచ్చారట. అయితే, అంతకుముందు మేజర్ అనే శునకం కూడా బైడెన్ వద్ద ఉండేదని,  అది కూడా కమాండర్ లానే కొంత మంది సీక్రెట్ సర్వీస్ అధికారుల్ని కరుస్తుండటంతో దాన్ని అధ్యక్షుడు తన మిత్రుల వద్దకు పంపించేసినట్లు వెల్లడించింది.

Social Share Spread Message

Latest News