Skip to main content

Namaste NRI

విక్రమ్‌కు అతిథిగా బిగ్‌ బి?

బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌  హిందీనాట తిరుగులేని కథానాయకుడు.  గడిచిన కొద్ది సంవత్సరాలుగా బాలీవుడ్‌లో అభినయానికి ఆస్కారమున్న ప్రధాన పాత్రల్లో అలరిస్తూ వస్తున్నారు. అంతేకాదు అడపాదడపా దక్షిణాది భాషల్లోనూ ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. ఇప్పటికే కన్నడ, మలయాళ, తెలుగు భాషల్లో అతిథి తరహా పాత్రల్లో పలకరించిన అమితాబ్‌ బచ్చన్‌ త్వరలో తమిళ చిత్ర పరిశ్రమలోనూ సందడి చేయనున్నారు. కమల్‌హాసన్‌ తాజా సినిమా విక్రమ్‌ లో అమితాబ్‌ బచ్చన్‌ అతిథిగా కనిపిస్తారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. కమల్‌హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌  ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం విక్రమ్‌. పొలిటికల్‌ డ్రామాకు గ్యాంగ్‌స్టర్‌ టచ్‌తో సాగే ఈ చిత్రానికి లోకేష్‌ కనగరాజ్‌ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ అతిథిగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సీన్‌ క్లైమాక్స్‌లో వస్తుందట. ఈ ఏడాది జూన్‌ 3న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Social Share Spread Message

Latest News