Skip to main content

Namaste NRI

నాగ చైతన్య హీరోగా ద్విభాషా చిత్రం

హీరో నాగ చైతన్య ఓ ద్విభాషా చిత్రంలో నటించబోతున్నారు. తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు రూపొందించనున్నారు. నాగా చైతన్య హీరోగా నటిస్తున్న ఈ 22వ చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తున్నారు.  కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని, త్వరలో నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తామని చిత్ర నిర్మాత తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా చిత్రీకరణ జరపనున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య నటించిన థాంక్యూ సినిమా విడులకు సిద్ధమవుతున్నది. దీంతో పాటు దూత అనే వెబ్‌ సిరీస్‌లో ఆయన నటిస్తున్నారు.

Social Share Spread Message

Latest News