Skip to main content

Namaste NRI

అమెరికాలో మంచు తుఫాను బీభత్సవం

మంచు తుఫాన్‌ అగ్రరాజ్యం అమెరికాలో బీభత్సం సృష్టిస్తోంది. నార్త్‌ అమెరికా గజగజమణి వణికిపోతుంది. నార్త్‌ ఈస్ట్‌, మిడ్‌ అట్లాంటిక, న్యూయార్క్‌, బోస్టన్‌, ఫిలడెల్ఫియాలో ఎక్కడ చూసినా భారీగా మంచు పేరుకుంది. భారీగా మంచు కురుస్తుండడంతో ప్రాంతాల్లో ఊర్లు, పొలాలు, రోడ్లు, వాహనాలను మంచు దుప్పటి కప్పేసింది. రెండు అడుగుల మేర మంచు పేరుకు పోవడంతో రోడ్లన్ని ప్రమాదకరంగా మారాయి. అత్యవసర పనుల మీద రోడ్ల మీదకు వస్తున్న వాహనాలు స్కిడ్‌ అవుతున్నాయి. మంచు భారీగా కురుస్తుండటంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో అమెరికా ప్రభుత్వం చర్యలను చేపట్టింది. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంచు తుఫాన్‌ ధాటికి ప్రభుత్వ కార్యాలయాలను, విద్యాసంస్థలను మూసివేస్తున్నామని ప్రకటించింది.

                        కరోలినాస్‌, అప్పలాంచియా ప్రాంతాల్లో శీతలగాలులు తీవ్రతతో కరొలినాస్‌, అప్పలాంచియా ప్రాంతాల్లో గంటలకు వంద కిలోమీటర్ల వేగంతో చలి గాలులు వీస్తున్నాయి. దీంతో స్థానిక అధికారులు స్నో ఎమర్జెన్సీ ప్రకటించారు. బహిరంగ పార్కింగ్‌లను నిషేధించారు. ప్రయాణాలకు మానుకోవాలని సూచించారు. జనవరి ఆరంభంలో వర్జీనియాలో వచ్చిన మంచు తుఫాను సందర్భంగా జరిగిన వందలాది రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు మంచు తుఫాన్‌ కారణంగా పలు విమాన సర్వీసులను విమానయాన సంస్థలు రద్దు చేశాయి. దీంతో సుమారు 4 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి.

Social Share Spread Message

Latest News