1940నాటి హిస్టారికల్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్తో ప్రభాస్ నటిస్తున్న పానిండియా యాక్షన్ డ్రామా ఫౌజీ. ఇమాన్వి కథానాయిక. హను రాఘవపూడి దర్శకత్వం. మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. లార్జర్ దేన్ లైఫ్ ఎలిమెంట్స్తో కూడిన పాన్ ఇండియా సినిమాగా దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండ్ అనుపమ్ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల అనుపమ్ ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు హను రాఘవపూడి ప్రతిభను కూడా ఆయన ప్రశంసించారు. ఇండియన్ బాహుబలి ప్రభాస్తో నా 544వ చిత్రం ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రతిభావంతుడైన దర్శకుడు హను రాఘవపూడి, రాజీ అనే పదానికి అర్థం తెలియని మైత్రీ మూవీమేకర్స్, మై డియర్ ఫ్రెండ్ సుదీప్ ఛటర్జీ, ఈ కలయిక నిజంగా అద్భుతం అని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్.
