ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై శ్రేణులు వారి వారి దేశాలలో ఘనంగా జెండా పండగ నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపు నిచ్చారు. ఈ సందర్బంగా మహేష్ బిగాల మాట్లాడుతూ ఈ సంవత్సరం జరిగే ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలకు అమెరికాలో ప్రత్యక్షంగా హాజరు అవుతున్నట్టు తెలిపారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ ఎన్నారైలను ఏకం చేస్తామని మహేష్ బిగాల స్పష్టం చేశారు.


