Skip to main content

Namaste NRI

ఈ నెల 20న డేగల బాజ్జీ

హాస్యనటుడు బండ్ల గణేష్‌ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టైటిల్‌ డేగల బాజ్జీ. తమిళంలో విమర్శకుల ప్రశంసలు పొందిన ఉత్త సిరుప్పు సైజు 7 చిత్రాన్ని తెలుగులో డేగల బాజ్జీ పేరుతో రీమేక్‌ చేస్తున్నారు.  వెంకట చంద్ర దర్శకత్వం వహించగా యశ్రిషి ఫిల్మ్స్‌ పతాకంపై స్వాతి చంద్ర నిర్మించారు. ఒకే ఒక పాత్రలో నడిచే చిత్రమిది. బంగ్ల గణేష్‌ మాట్లాడుతూ ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్స్‌ ఉన్నా వాళ్ల వాయిస్‌ మాత్రమే వినిపిస్తుంది. ఓ హత్య కేసులో పోలీస్‌ విచారణ ఎదుర్కొన్న వ్యక్తి కథ ఇది. తమిళంలో పార్థీబన్‌ నటించగా, ఆయనకు  జాతీయ అవార్డును సంపాదించిపెట్టింది. నటుడిగా నాలోని కొత్త కోణాన్ని వెలికితీసే చిత్రమవుతుంది అన్నారు. బండ్ల గణేష్‌ అద్బుతంగా నటించాడని దర్శకుడు తెలిపారు. మే 20న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు రంజాన్‌ సందర్భంగా ప్రకటించారు. మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ కథనంలో బండ్ల గణేష్‌ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని చిత్ర బృందం తెలిపింది. దీనికి సంగీతం : లైనస్‌, ఛాయాగ్రహణం అరుణ్‌ దేవినేని.

Social Share Spread Message

Latest News