Skip to main content

Namaste NRI

కెనడా కీలక ప్రకటన… వారికి మరో అవకాశం

విదేశీ గ్రాడ్యుయేట్లకు  కెనడా ప్రభుత్వం గోల్డెన్ ఆఫర్ ఇచ్చింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్లను మరో ఏడాదిన్నర పాటు పొడిగించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్, రిఫ్యూజీస్ అండ్ సిటిజెన్‌షిప్ కెనడా  కీలక ప్రకటన చేసింది. విదేశీ పోస్ట్ గ్రాడ్యుయేట్లకు సంబంధించి ఎవరివైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ల గడువు త్వరలో ముగియనుందో (లేదా) ఇటీవలే గడువు ముగిసిందో వారికి వర్క్ పర్మిట్ల వాలిడిటీని పెంచుకునేందుకు మరో అవకాశం ఇస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. ఇలా చేయడం ద్వారా గ్రాడ్యుయేట్లు మరింత కాలంలో కెనడాలోనే ఉండి, మరికొంత వర్క్ ఎక్స్‌పిరీయన్స్ పొందేందుకు వీలు కలుగుతుందని తెలిపింది. దీనిలో భాగంగా ఏడాదిన్నర పాటు వర్క్ పర్మిట్ల గడువును పొడిగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.  ఇక తాజాగా ప్రకటించిన 18 నెలల వర్క్ పర్మిట్ గడువు పొడిగింపు అనేది ఈ ఏడాది ఏప్రిల్ 6 నుంచి అమల్లోకి వస్తుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని విదేశీ గ్రాడ్యుయేట్లు  సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Social Share Spread Message

Latest News