Skip to main content

Namaste NRI

కెనడా కీలక నిర్ణయం

ఖలిస్థాన్‌ వేర్పాటువాదుల విషయంలో కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. ఖలిస్థాన్‌ వేర్పాటువాదులు తమ దేశ జాతీయ భద్రతకు ముప్పుగా కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ ప్రకటించింది. తమ హింసాత్మక తీవ్రవాద ఎజెండాను కెనడాలో ప్రచారం చేయడానికి వేర్పాటువాదుల బృందం వివిధ సంస్థలను వాడుకుంటున్నదని పేర్కొన్నది. ఈ మేరకు 2025 పబ్లిక్‌ రిపోర్ట్‌ ను విడుదల చేసింది. కెనడా కేంద్రంగా ఖలిస్థాన్‌ వేర్పాటువాదుల (సీబీకేఈ) హింసాత్మక కార్యకలాపాలు ఈ దేశానికి, కెనడా ప్రయోజనాలకు ముప్పుగా నివేదిక పేర్కొన్నది.

కెనడా పౌరులతో సంబంధాలు కొనసాగిస్తున్న సీబీకేఈ.. తీవ్రవాద ఎజెండా ప్రచారానికి వారిని ఉపయోగించుకుంటు న్నది. అమాయక పౌరుల నుంచి నిధులు సేకరించి, వాటిని హింసాత్మక కార్యకలాపాల వైపు మళ్లిస్తున్నది అని నివేదిక తెలిపింది. నివేదికను కెనడా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. జస్టిన్‌ ట్రూడో తర్వాత కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మార్క్‌ కార్నీ, భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Social Share Spread Message

Latest News