Skip to main content

Namaste NRI

సంతాన ప్రాంప్తిరాస్తు నుండి చాందిని చౌదరి బర్త్ డే పోస్టర్

విక్రాంత్‌, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సంతాన ప్రాప్తిరస్తు. సంజీవ్‌రెడ్డి దర్శకుడు. మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మాతలు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. నటి చాందినీ చౌదరి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు.

ఇందులో ఆమె పాత్ర పేరు కల్యాణి ఓరుగంటి. పెళ్లికూతురుగా ముస్తాబైన కల్యాణి ఓరుగంటిగా చాందినీ చౌదరిని ఈ పోస్టర్‌లో చూడొచ్చు. వివాహానంతరం కొత్త జంటలు ఎదుర్కొంటున్న ఓ సమస్య నేపథ్యంలో వినోదభరితంగా ఈ సినిమా సాగుతుందని మేకర్స్‌ చెబుతున్నారు. డాక్టర్‌ భ్రమరంగా వెన్నెల కిశోర్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో తరుణ్‌ భాస్కర్‌, అభినవ్‌ గోమటం, మురళీధర్‌గౌడ్‌, హర్షవర్దన్‌, సత్యకృష్ణ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: మహిరెడ్డి పండుగుల, సంగీతం: సునీల్‌ కశ్యప్‌.

Social Share Spread Message

Latest News