విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ నేతలకు టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం టీడీపీ ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయడానికి సిద్ధంగానే ఉన్నామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ పేరుతో 1960 లో విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించామని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వం వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఐక్య పోరాటాల వల్లే విశాఖ ఉక్కును రక్షించుకోగలమని చంద్రబాబు అన్నారు.