Skip to main content

Namaste NRI

బ్రిక్స్‌ సమావేశానికి హాజరుకాలేని చైనా విదేశాంగ మంత్రి : ఎందుకంటే?

దేశ రాజధాని ఢిల్లీలో జరిగే బ్రిక్స్‌ ‌సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ‌యి హాజరు కావడం లేదు. ఆయనకున్న బిజీ షెడ్యూల్‌ ‌కారణంగానే ఈ సదస్సుకి హాజరుకాలేకపోతున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. ఢిల్లీలో మే 14 – 15 తేదీల్లో బ్రిక్స్‌ ‌విదేశాంగ మంత్రల సమావేశం జరగనుంది. ఈరోజుల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ‌ట్రంప్‌ ‌చైనాలో పర్యటించనున్నారు. మే 13వ తేదీన ట్రంప్‌ ‌చైనాకు చేరుకోనున్నారు. ట్రంప్‌ ‌పర్యటన నేపథ్యంలో వాంగ్‌ ‌యి బీజింగ్‌‌లో ఉండనున్నారు. ఆయనకున్న బిజీ షెడ్యూల్‌ ‌కారణంగా బ్రిక్స్‌ ‌సమావేశానికి హాజరుకాలేరు. వాంగ్‌ ‌యికి బదులుగా భారత్‌‌లోని చైనా రాయబారి జు ఫీహాంగ్ బ్రిక్స్‌ ‌సమావేశానికి హాజరై ప్రాతినిధ్యం వహిస్తారు అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది.

Social Share Spread Message

Latest News