Skip to main content

Namaste NRI

చైనా మరోమారు ఔదార్యం… పాకిస్థాన్‌కు

చైనా తన మిత్రదేశం పాకిస్థాన్ పట్ల మరో మారు ఔదార్యం చాటుకుంది.రెండు బిలియన్ డాలర్ల మేర ఉన్న పాకిస్థాన్ రుణ చెల్లింపులను రీషెడ్యూల్ చేసేందుకు అంగీకరించింది. రెండేళ్ల పాటు ఈ రుణాలను చెల్లించే అవసరం లేదని తెలిపింది. ఆర్థిక సంక్షోభపు పాకిస్థాన్ నిలదొక్కుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా అప్పులు తీసుకుని అడుగంటిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను పునరుద్ధరించుకొంటోంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చైనా రుణ రీషెడ్యూల్ జరిగింది. ఇరు దేశాల మధ్య ఇటీవల జరిగిన సంబంధిత ఒప్పందానికి పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ డార్ సారథ్యపు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (ఇసిసి) ఆమోదం తెలిపింది.

Social Share Spread Message

Latest News