Skip to main content

Namaste NRI

చిత్రీకరణ తుది దశలో మేఘ ఆకాష్‌ చిత్రం

రాహుల్‌ విజయ్‌, మేఘా ఆకాష్‌ జంటగా ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నారు. తాజా చిత్రం తొంబైశాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. దర్శకుడు మాట్లాడుతూ గోవా నేపథ్యంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం. ఇటీవల గోవాలో ముగిసిన షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను తెరకెక్కించాం. వినూత్న ప్రేమకథా చిత్రమిది. ప్రేమికుల జీవితంలో చోటుచేసుకునే సంఘటనలు, మలుపులు ఉత్కంఠను పంచుతాయి అని తెలిపారు. ఈ చిత్రం ద్వారా ఆభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఎ.సుశాంత్‌ రెడ్డి, అభిషేక్‌ కోట నిర్మాతలు. మేఘా ఆకాష్‌ తల్లి బిందు అకాష్‌ సమర్పిస్తున్నారు.  రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిషోర్‌, అభయ్‌, వైవా హర్ష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్‌ రెడ్డి.

Social Share Spread Message

Latest News