Namaste NRI

గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

గోల్కొండ కోటపై జాతీయ జెండా రెపరెపలాడిరది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలోని రాణిమహల్‌ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి గోల్కోండకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి,  కళాకారులు స్వాగతం పలికారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఉన్న సైనిక వీరుల స్మారకం వద్ద అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి స్వాతంత్య్ర దినోత్సవ శభాకాంక్షలు తెలిపారు.

                జాతీయ పతాకావిష్కరణ అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. స్వాతంత్య్ర ఫలాలను సమీక్షించుకోవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ఠ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందన్నారు. అన్ని రంగాల్లో గుణాత్మక, గణనీయ అభివృద్ధిని ఆవిష్కరించాం. ప్రగతిఫలాలు ప్రజల అనుభవంలోకి వచ్చాయి. విద్యుత్‌, తాగు, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాం. విద్యుత్‌, సాగు, తాగునీటి రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శం. ఏడేళ్లలో స్థిర ఆర్థికాభివృద్ధితో సుసంపన్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది అని అన్నారు.

Social Share Spread Message

Latest News