Skip to main content

Namaste NRI

అమెరికా ఉపాధ్యక్షురాలు హత్య కు కుట్ర

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను హత్య చేయాలని ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ కుట్ర పన్నింది. అయితే చివరి నిమిషంలో అధికారులు ఆమె కుట్రను భగ్నం చేశారు. మహిళను అదుపులోకి తీసుకున్న అధికారులు తాజాగా ఆమెను మియామీ ఫెడరల్‌ కోర్టులో హాజరుపరిచారు. దాంతో సదరు మహిళ కమలాను హత్య చేయాలని యత్నించానని న్యాయస్థానంలో అంగీకరించింది. ఈ హత్య కోసం ఆమె ఏకంగా 53 వేల డాలర్లకు (సుమారు రూ.39 లక్షలు) బేరం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది.

                దక్షిణ ఫ్లోరిడాకు చెందిన నివియేన్‌ పెటిల్‌ ఫెల్ప్స్‌ (39) అనే మహిళ ఒకటికాదు రెండు కాదే ఏకంగా ఆరు సార్లు కమలాను తాను హత్య చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు కోర్టులో నివియేన్‌ అంగీకరించింది. ఫిబ్రవరిలో ఉపాధ్యక్షురాలిని హత్య చేస్తానంటూ జైలులో ఉన్న తన భర్తకు తాను తీసుకున్న సెల్ఫీ వీడియోలను సైతం పంపించిందని న్యాయవాదులు విచారణ సందర్బంగా తెలిపారు. యాభై రోజుల్లో ఆమెను హతమారుస్తానని వీడియోల్లో నివియేన్‌ చెప్పిందని వారు తెలియజేశారు. నివియేన్‌ పెటిట్‌ కోర్టు ఐదేండ్ల జైలు శిక్ష విధించింది.

Social Share Spread Message

Latest News