Skip to main content

Namaste NRI

అమెరికాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా!

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తున్నది. గతేడాది కూడా అమెరికాను చిగురుటాకులా వణికించిన ఈ మహమ్మారి మళ్లీ అక్కడ పడగ విప్పుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తుండటం కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో అమెరికాలో దాదాపు లక్షన్నర కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ ఇంత భారీగా కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది.  ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్‌ వంటి రాష్ట్రాల్లోనే కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అమెరికా వ్యాప్తంగా వస్తున్న కొత్త కేసుల్లో మూడో వంతు ఈ రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. అమెరికాలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 3.35 కోట్లకు చేరింది. గత వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్‌ కేసుల్లో అత్యధిక భాగంగా అమెరికా నుంచే ఉన్నట్లు ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది.

Social Share Spread Message

Latest News