Namaste NRI

కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం : మహేష్ బిగాల

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వం దేశానికి అవసరమని, జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ నాయకత్వం అవసరమన్న తీర్మానానికి 52 దేశాల ఎన్నారై ప్రతినిధులతో మద్దతు కూడగట్టిన  విషయాన్ని  గుర్తు చేశారు. విజయ దశమని రోజున కార్యరూపం దాల్చుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో  రూపాయి విలువ పతనమైందన్నారు. కేసీఆర్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. జాతీయ పార్టీ ఆవిర్భావం దేశ  భవిష్యత్‌ను మార్చబోతుందన్నారు. బీజేపీ ముక్త్‌ భారత్‌ నినాదంతో కేసీఆర్‌ అడుగుజాడల్లో ముందుకెళ్తామన్నారు. ప్రపంచదేశాల్లో ఉన్న ఎన్నారైలందరినీ ఏకం చేస్తామని, జాతీయ పార్టీకి ముందుకు తీసుకెళ్తామన్నారు. విదేశాల్లో ఉన్న వారందరికీ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో వివరించి, మద్దతు కూడగడుతామన్నారు.

Social Share Spread Message

Latest News