Skip to main content

Namaste NRI

కోర్టు రూమ్‌ డ్రామా డ్యూ డేట్‌ చిత్రం ప్రారంభం

కోర్ట్‌ రూమ్‌ డ్రామాగా రూపొందుతున్న డ్యూ డేట్‌ చిత్రం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా ఫిల్మ్‌ జర్నలిస్ట్‌గా సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతున్నారు. మరో నిర్మాత పవన్‌ తరిగోపులతో కలిసి వర్షిష్‌ స్టూడియోస్‌ పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లోమేష్‌ పూడిపెద్ది, జయశ్రీ, ప్రణీత పట్నాయక్‌, విజ్ఞాని, చందు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆనంద్‌.కె దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు మారుతి క్లాప్‌నివ్వగా, బన్నీ వాస్‌ కెమెరా స్విఛాన్‌ చేశారు.

నిర్మాతలు ఎస్‌కేఎన్‌, ధీరజ్‌ మొగిలినేని, వంశీ నందిపాటి దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. సమాజంలోని ఓ సీరియస్‌ ఇష్యూని ఈ సినిమాలో చర్చించబోతున్నామని, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కోర్ట్‌డ్రామాగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని, త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: చెంచు జింక, నిర్మాతలు: ఏలూరు శ్రీను, పవన్‌ తరిగోపుల, దర్శకత్వం: ఆనంద్‌.కె.

Social Share Spread Message

Latest News