Skip to main content

Namaste NRI

దాస్‌ కా ధమ్కీ ఫస్ట్‌ సింగిల్‌ విడుదల

విశ్వక్‌సేన్‌ తన తొలి  పాన్‌ ఇండియా చిత్రం దాస్‌ కా ధమ్కీ.. టైటిల్‌ రోల్‌ పోషిస్తుండటంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు.  డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో విశ్వక్‌సేన్‌ కన్పించిన ఈ చిత్రం ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.  ప్రస్తుతం ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. ఫస్ట్‌సింగిల్‌  ఆల్మోస్ట్‌ పడిపోయిందే పిల్ల.. లిరికల్‌ వీడియోకు భారీ స్పందన వచ్చింది. తాజాగా వీడియో సాంగ్‌ను విడుదల చేయటం ద్వారా మేకర్స్‌ ఫుల్‌ ఫీస్ట్‌ను అందించారు. విదేశాల్లో ఈ పాటను  చిత్రీకరించారు.  విశ్వక్‌సేన్‌, సినిమాస్‌ బ్యానర్లపై కరాటేరాజు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ బాషల్లో విడుదల కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Social Share Spread Message

Latest News