జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య నంబీషన్, కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించిన దయా వెబ్ సిరీస్ ఈ నెల 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగాహీరో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ దయా వెబ్ సిరీస్ లోని ప్రతి ఎపిసోడ్ ప్రశ్నలతో ముగుస్తుంది. ఈ ప్రశ్నలన్నీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయవు..ఇంట్రెస్ట్ కలిగిస్తాయి. దయా కథ ఒక సీజన్ తో ఆగదు, సెకండ్ సీజన్ కోసం మీరు వెయిట్ చేస్తూనే ఉంటారు. అలాగే సెకండ్ సీజన్ కు మీరే కథలు ఊహించుకుంటారు. ఈ సిరీస్ లో చివరి సీన్ తో నా ఫస్ట్ సీన్ షూటింగ్ చేశాడు పవన్. ఈ కథ మీద అతనికున్న గ్రిప్ అలాంటిది. నేను అన్ని భాషల్లో మంచి దర్శకులతో పనిచేశాను. మా గురువు వర్మ తర్వాత నేను వర్క్ చేసిన బెస్ట్ డైరెక్టర్ పవన్. దయా అంటే పవన్ ..పవన్ అంటే దయా. రేపు ఈ సిరీస్ లో అతని టాలెంట్ చూస్తారు. గాయత్రి, ఈషా క్యారెక్టర్స్ చూస్తే పవన్ కు వుమెన్స్ మీద ఉన్న గౌరవం తెలుస్తుంది. ఈ నెల 3వ తేదీ రాత్రి నుంచే దయా స్ట్రీమింగ్ మొదలవుతుంది. తప్పకుండా చూడండి. అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడులు జోష్ రవి,కమల్ కామరాజు,నటి గాయత్రి గుప్తా,హీరోయిన్ ఈషా రెబ్బా, డైరెక్టర్ పవన్ సాధినేని,సినిమాటోగ్రాఫర్ వివేక్పాల్గొన్నారు.














