డెడ్ పూల్ మూవీ ప్రాంఛైజ్ నుంచి వస్తున్న మూడో సినిమా డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ ఈ నెల 26న విడుద ల కానుంది. వాల్వరిన్‌గా హుయ్ జాక్‌మన్, డెడ్ ఫుల్‌గా రయన్ రెనాల్డ్స్ నటించారు. ఇందులో సూపర్ హీరోలు డెడ్ పూల్, వాల్వరిన్ చేసే సాహసాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్స్ ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందాయి. ఈ నేపథ్యంలో మార్వెల్ టీమ్ ఈ సినిమాను అన్ని భారతీ య భాషల్లో విడుదల చేస్తోంది. అన్ని భాషల డబ్బింగ్స్ పూర్తయ్యాయి. తెలుగులో ఉన్న ట్రెండింగ్ పదాలు, యూత్ మధ్య విపరీతంగా వినిపించే డైలాగ్స్‌తో తెలుగు వెర్షన్ సిద్ధమైంది. కుర్చీ మడత పెట్టి, కెవ్వు కేక, రింగ రింగా వంటి ప్రేక్షకులను అలరించే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయని చెబుతున్నారు.