Skip to main content

Namaste NRI

యూకేలో తగ్గుతున్న భారత్ విద్యార్థులు

కఠినతరమైన వీసా నిబంధనలు, వలసదారులపై ఆందోళనల కారణంగా బ్రిటన్‌ విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ స్టాటిస్టిక్స్‌ ఏజెన్సీ (హెచ్‌ఈ ఎస్‌ఏ) విడుదల చేసిన డాటా ప్రకారం 2022-23 విద్యా సంవత్సరంలో మిగిలిన దేశాల విద్యార్థుల కన్నా మనదేశ విద్యార్థులే అధికంగా యూకేకు వెళ్లారు. 2018-19 నుంచి చూస్తే మొత్తం మీద భారత విద్యార్థుల సంఖ్య 1,45,650కి పెరిగింది. అయితే ఇటీవల వలసదారులను వ్యతిరేకిస్తూ ఆ దేశంలో జరుగుతున్న ఆందోళ నలు, హింస కారణంగా విద్యార్థులకు ఆ దేశంపై ఆసక్తి తగ్గింది. నిపుణులైన ఉద్యోగులు, విద్యార్థులు వీసాల కోసం చేసే దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందని తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. స్టూడెంట్‌ వీసా ల సంఖ్య 16 శాతం, డిపెండెంట్‌ వీసా దరఖాస్తులు 81% తగ్గినట్టు ఆ లెక్కలు వెల్లడించాయి.

Social Share Spread Message

Latest News