దేశరాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన ఘనత సాధించింది. ప్రపం చంలోనే అత్యంత రద్దీగా ఉండే టాప్ 10 విమానాశ్రయాల్లో చోటు దక్కించుకుంది. 2023లో ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే టాప్ టెన్ ఎయిర్ పోర్ట్స్ జాబితాను ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికాలో గల అట్లాంటా ఎయిర్ పోర్ట్ తొలి స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత దుబాయ్, డల్లాస్/ పోర్ట్ వర్త్, లండన్, యుకే, టోక్యో, జపాన్, డెన్వార్ అమెరికా, ఇస్తాంబుల్- టర్కీ, లాస్ ఏంజెల్స్, చికాగో వరసగా ఉన్నాయి. రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్స్ జాబితాలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పదో స్థానంలో నిలవడం విశేషం.