Skip to main content

Namaste NRI

నాగార్జున క్లాప్‌తో దూత 2 గ్రాండ్‌గా ప్రారంభం

సూపర్‌నేచురల్‌ మిస్టరీ థ్రిల్లర్‌ దూత వెబ్‌సిరీస్‌తో ఓటీటీ వేదికపై తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకున్నారు హీరో నాగచైతన్య. తాజాగా ఈ సిరీస్‌కు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నాగచైతన్య, శరత్‌మరార్‌ నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో దూత సీక్వెల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. దీనికి అగ్ర నటుడు నాగార్జున క్లాప్‌నిచ్చారు. ఈ సీక్వెల్‌కు నాగచైతన్య నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. తండేల్ బ్లాక్‌బస్టర్ విజయానంతరం వృషకర్మ చేస్తున్న నాగచైతన్య తన తదుపరి ప్రధాన ప్రాజెక్ట్‌గా దూత 2ను ఎంచుకోవడం విశేషం.

నిర్మాతగా తొలి అడుగు వేస్తున్నా. మరోసారి మ్యాజిక్‌ని వీక్షించడానికి సిద్ధంగా ఉండండి అని నాగచైతన్య పేర్కొన్నారు. పార్వతీ తిరువోతు, ప్రియా భవానీ శంకర్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు కెమెరా: ముఖేశ్వరణ్‌, సంగీతం: ఈషాన్‌ ఛాబ్రా, ప్రొడక్షన్‌ డిజైన్‌: ప్రవళ్ల డి, రచన-దర్శకత్వం: విక్రమ్‌ కె కుమార్‌.

Social Share Spread Message

Latest News