Skip to main content

Namaste NRI

మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా?

మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా అంటే అవుననే అంటోంది రష్యా. నల్లసముద్రంలో రష్యా యుద్ధనౌక మాస్క్యా మునిగిపోయిన నేపథ్యంలో రష్యా అధికారిక టెలివిజన్‌ చానెళ్లలో ఈ మేరకు కథనాలు ప్రసారమయ్యాయి. ప్రభుత్వ నిర్వహణలోని  ప్రజెంటర్‌ ఓల్గా స్కబెయేవా మాట్లాడుతూ ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టే. మనం ఇప్పుడు నాటోపై నేరుగా కాకపోయినా ఆ కూటమి అందిస్తున్న ఆయుధ వ్యవస్థలపై పోరాడుతున్నాం. ఇది గమనించాలంటూ అమె కీలక వ్యాఖ్యలు చేసింది. నల్ల సముద్రంలో మొహరించి ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలో క్షిపణి దాడులకు వేదికగా మారిన రష్యా యుద్ధనౌక మాస్క్వాలో పేలుళ్లు సంభవించి మునిగిపోయిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌ తమ నెప్ట్యూన్‌ క్షిపణులతో దాడి చేసి ముంచేసామని ప్రకటిస్తుండగా సముద్రంలో వాతావరణం అల్లకల్లోలంగా మారడంతో నౌకలో పేలుళ్లు సంభవించి మునిగిపోయిందని రష్యా వాదిస్తోంది.

Social Share Spread Message

Latest News