Skip to main content

Namaste NRI

వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు

అమెరికా వైట్‌ హౌస్‌ లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆయన సతీమణి, ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ కమలాహ్యారిస్‌ పాల్గొన్నారు. దీపాలను వెలిగించి జో బైడెన్‌ వేడుకలను ప్రారంభించారు. అమెరికా చరిత్రలోనే తొలి ఆఫ్రికా..దక్షిణాసియా మహిళ కమలా హ్యారిస్‌ నేతృత్వంలోని నా కార్యనిర్వాహక వర్గం సమక్షంలో దీపాలను వెలిగించడం గౌరంగా భావిస్తున్నానని బైడెన్ అన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు బైడెన్‌ శుభాకాంక్షలు తెలిపారు. శ్వేత సౌధం ఒక ప్రజాసౌధం. ఇక్కడ అన్ని జాతుల వారు.. అధ్యక్షుడు, తొలి మహిళతో కలిసి వారి పండుగలను నిర్వహించుకోవచ్చు.

100 కోట్ల మంది ప్రజలతో కలిసి బైడెన్‌ కార్యవర్గం కూడా దీపం వెలిగించి చెడుపై మంచి, అజ్ఞానంపై విజ్ఞానం, చీకటిపై వెలుతురు జరిపే పోరాటంలో భాగమైందని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ పేర్కొన్నారు. మీకు ఆతిథ్యమివ్వడాన్ని గౌరవంగా భావిస్తాను. శ్వేత సౌధంలో ఈ స్థాయిలో నిర్వహిస్తున్న తొలి దీపావళి ఇదే. మా వద్ద గతంలో కంటే ఇప్పుడు చాలా మది ఆసియా-అమెరికన్లు ఉన్నారు. దీపావళిని అమెరికా సంస్కృతిలో సంతోషకరమైన వేడుకలుగా మార్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

Social Share Spread Message

Latest News