Skip to main content

Namaste NRI

ఆ దేశానికి వెళ్లకండి : అమెరికా

కరోనా కొత్త వేరియంట్‌ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఈ  క్రమంలోనే కరోనా నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే.. అమెరికా పౌరులకు సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) తాజాగా కీలక సూచన చేసింది. పక్కనే ఉన్న కెనడాకు వెళ్లొదని తెలిపింది. కొవిడ్‌ ఉధృతి ఎక్కువగా ఉన్నందువల్లే కెనడా ప్రయాణం మానుకోవాలని సూచించినట్టు పేర్కొంది. యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ సైతం ట్రావెల్‌ అడ్వైజరీలో కీలక సవరణలు చేసింది. లెవెల్‌ ఫోర్‌ ప్రయాణించడానికి వీల్లేని) దేశాల జాబితాలో చేర్చింది. కెనడాకు ప్రయాణ ప్రయత్నాలను విరమించుకోవాలని తెలిపింది. కాగా మార్చి 2020లో కెనడాతో అమెరికా తన భూ సరిహద్దులను మూసేసింది. అయితే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకున్న పౌరులను అనుమతించే క్రమంలో గత నవంబర్‌లో ఆంక్షలను ఎత్తేసింది. తాజాగా ఒమ్రికాన్‌ కలవరపెడుతున్న నేపథ్యంలో లెవల్‌ ఫోర్‌ దేశాల జాబితాలో కెనడాకు చేర్చింది.

Social Share Spread Message

Latest News