Namaste NRI

ఆ  భవనంపై దాడికి… డొనాల్డ్‌ ట్రంప్‌ కుట్రదారుడే

అమెరికా కాంగ్రెస్‌ భవనంపై దాడికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పన్నినట్టు జనవరి 6 కాంగ్రెస్‌ కమిటీ నిర్దారించింది. 2020 అధ్యక్ష ఎన్నికల చట్టబద్దమైన ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్‌ నేరపూరితంగా బహుముఖ కుట్ర కు పాల్పడ్డారని తేల్చింది. కాంగ్రెస్‌పై దాడి చేయకుండా తన మద్దతుదారులను నిరోధించలేకపోయారని పేర్కొన్నది. మాజీ అద్యక్షుని అనుచిత ప్రవర్తన, కాంగ్రెస్‌ సాయుధ తిరుగుబాటుదారులపై దాడిపై 18 మాసాల దర్యాప్తు అనంతరం కమిటీ 814 పేజీల నివేదికను విడుడదల చేసింది.  జనవరి 6న జరిగిన ఘటనలపై ఏర్పాటైనది కావడం వల్ల కమిటీని ఆ పేరుతోనే వ్యవహరిస్తున్నారు. ఈ దర్యాప్తు లో భాగంగా కమిటీ వెయ్యిమందికి సాక్షులని విచారించి, పదిసార్లు బహిరంగ విచారణలు నిర్వహించి, లక్షలాది పత్రాలను పరిశీలించింది. ప్రభుత్వ పదవి చేపట్టకుండా ట్రంప్‌పై నిషేధం విధించాలని కమిటీ సిఫారసు చేసింది. 

Social Share Spread Message

Latest News