అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పోర్న్ స్టార్ హష్ మనీ కేసులో శిక్ష ఖరారైనప్పటికీ శ్వేత సౌధంలో అడుగుపెడుతున్న తొలి నేతగా ప్రతికూల రికార్డ్ సృష్టించనున్నారు. పోర్న్ స్టార్‌కు హష్ మనీ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న ట్రంప్‌నకు శిక్ష విధిస్తానంటూ న్యూయార్క్ న్యాయమూర్తి హవాన్ మర్చన్ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆయన శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల 20న ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనుండగా, 10వ తేదీన ఆయనకు శిక్ష విధిస్తామని మర్చన్ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆయన జైలు శిక్ష అనుభవించకుండా, జరిమానా చెల్లించకుండా అన్ కండిషనల్ డిశ్చార్జ్‌ను అమలు చేస్తామని జడ్జి తెలిపారు. శృంగార తార స్మార్టీ డానియల్స్‌తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారని ఆరోపణలు వచ్చాయి. 2016 ఎన్నికల్లో ఆమె దీనిపై నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్ ఆమెకు 1.30 లక్షల డాలర్ల హష్‌మనీని ఇచ్చారన్నది ఆరోపణ.