Namaste NRI

ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోకుండా ఆలస్యం చేస్తున్న ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై తాను మంచిగా ఉండబోనంటూ ప్రకటించారు. ఇకపై తాను మంచివాడికి కాను అంటూ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
అణు నిరాయుధీకరణ ఒప్పందంపై ఇరాన్ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని, అమెరికా మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఇరాన్ ఈ విషయంలో తెలివిగా వ్యవహరించాలన్నారు. చర్చల విషయంలో ఇరాన్ సరిగ్గా వ్యవహరించలేకపోతోందని, అణు ఒప్పందం విషయంలో ఎలా వ్యవహరించాలో వారికి తెలియడం లేదని ట్రంప్ అన్నారు. అణు ఒప్పందం విషయంలో ఇరాన్‌కు కొత్త ప్రతిపాదనలు చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. వాటిని అంగీకరించాలని సూచించారు. ఇరాన్–అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ చర్చలు మాత్రం కొనసాగడం లేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events