Skip to main content

Namaste NRI

దొంగోడే దొరగాడు అంటోన్న బెదురులంక 2012

కార్తికేయ గుమ్మకొండ, డీజే టిల్లు  ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన ఎంటర్టైనర్ బెదురులంక 2012. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. సి. యువరాజ్ సమర్పకులు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో మూడో పాట దొంగోడే దొరగాడే ను విడుదల చేశారు. కిట్టూ విస్సాప్రగడ రాశారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఓ మతం, ఓ ఆచారం, ఓ సంప్రదాయం అని కాదు, ప్రతి ఊరిలో, ప్రతి చోట మతం పేరుతో మనుషుల్ని దోచుకునే మోసగాళ్లు ఉన్నారని చెప్పే గీతమిది. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఏం జరుగుతుందో చూపించినట్లు లిరికల్ వీడియో చూస్తుంటే అర్థం అవుతోంది.

నిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ మేం విడుదల చేసిన పాటలకు, ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల్లో  మంచి స్పందన లభిస్తోంది. సినిమాపై క్రేజ్ నెలకొంది. విడుదలకు నెల ముందు బిజినెస్ అంతా క్లోజ్ అయ్యింది. మా సినిమాకు అద్భుతమైన బాణీలు అందించిన మణిశర్మ గారికి థాంక్స్. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది. గోదావరి నేపథ్యంలో  ఇప్పటి వరకు వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా సినిమా ఉంటుంది అని అన్నారు. దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ఒక ఊరి ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని, వాళ్ళకు దేవుని మీద ఉన్న భక్తిని గమనించిన కొందరు మోసగాళ్లు మూఢ నమ్మకాల పేరుతో ప్రజలను ఎలా దోచుకుంటున్నారనేది ఈ పాటలో చూపించాం. కథలో భాగంగా వస్తుంది. ప్రేక్షకులకు వినోదం అందించడంతో పాటు వారిలో ఓ ఆలోచన రేకెత్తించే పాట ఇది  అని చెప్పారు. ఆగస్టు 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events