
మలయాళ దర్శకుడు శ్యామ్దత్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ రూపొందించిన సైకలాజికల్ థ్రిల్లర్ డోంట్ స్లీప్. ఇంద్రరామ్, రవీంద్ర విజయ్, తబా రీమా ప్రధాన పాత్రధారులు. వీ. చూడామణి నిర్మాత. ఈ చిత్ర టీజర్ను విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, నాగచైతన్య కలిసి విడుదల చేశారు. హీరోని కలలో చంపాలని ప్రయత్నించిన ఓ అపరిచిత వ్యక్తి, అతని నిజ జీవితంలో కూడా కనిపించి వేటాడటం, ప్రాణరక్షణ కోసం హీరో ప్రయత్నాల నేపథ్యంలో టీజర్ ఆద్యంతం ఉత్కంఠను పంచింది.















