యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) విదేశీయుల రాకపై ప్రయాణ ఆంక్షలను తొలగించడంతో భారీగా సందర్శకులు, ప్రవాసులు ఆ దేశానికి తిరిగి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఫెడరల్ కస్టమ్స్ అథారిటీ తాజాగా ఓ ప్రకటన చేసింది. యూఏఈకి వస్తున్న వారితో పాటు అక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లుతున్న వారు తమతో పాటు ఎంత డబ్బు తీసుకెళ్లవచ్చు అనే దానిపై అధికారులు ఈ ప్రకటన చేశారు. ప్రయాణికులు ఎంత డబ్బైనా తీసుకెళ్లవచ్చని, దానిపై ఎలాంటి లిమిట్ లేదని అధికారులు స్పష్టం చేశారు. కానీ 60 వేల దిర్హమ్స్ (సుమారు రూ.12 లక్షలు) లేదా అంతకంటే ఎక్కువ తీసుకెళ్లిన లేక తెచ్చుకున్న దానిపై కస్టమ్స్ అధికారులకు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడిరచారు. ఈ నెల 16న కస్టమ్ అథారిటీ వెల్లడిరచింది.