Skip to main content

Namaste NRI

దుబాయ్ కీలక ప్రకటన….  ఈ ఏడాది రికార్డు స్థాయిలో  

రికార్డు స్థాయిలో భారత పర్యాటకులు ఈ ఏడాది దుబాయ్‌ను సందర్శించినట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. గత ఏడాది తొలి అర్థభాగంలో దాదాపు 4 లక్షల మంది భారత పర్యాటకులు దుబాయ్‌ను సందర్శిస్తే, ఆ సంఖ్య ఈ ఏడాది రెట్టింపు అయిందని దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమి అండ్ టూరిజం పేర్కొంది. ఈ ఏడాది తొలి అర్థభాగంలో సుమారు 8.58లక్షల మంది భారత పర్యాటకులు దుబాయ్‌ని సందర్శించినట్టు తెలిపింది. ఈ ఏడాది తొమ్మిది నెలలో దాదాపు పలు దేశాలకు చెందిన 6.8మిలియన్ల టూరిస్టులు దుబాయ్‌‌కు వచ్చినట్టు పేర్కొంది. ఇందులో భారత టూరిస్టుల సంఖ్య 1.2 మిలియన్ల‌ని స్పష్టం చేసింది.  ఈ ఏడాది చివరి త్రైమాసికంలో మరో నలభై లక్షల మంది టూరిస్టులు దుబాయ్‌కు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా కరోనాకు ముందు అంటే 2019లో మొత్తం 16.7 మిలియన్ల మంది పర్యాటకులు దుబాయ్‌ను విజిట్ చేశారట.

Social Share Spread Message

Latest News