దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం లక్కీభాస్కర్. మీనాక్షి చౌదరి కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమాలోని దుల్కర్ ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. బ్యాంక్ క్యాషియర్‌గా మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో ఇందులో దుల్కర్ కనిపి స్తున్నారు. ఒక సాధారణవ్యక్తి, అసాధారణ శక్తిలా ఎలా మారాడు? ఒక మధ్య తరగతి వ్యక్తి, భారీ మొత్తంలో డబ్బు ఎలా సంపాదించాడు? ఈ క్రమంలో అతని జీవితంలో ఎదురైన పరిణామాలేంటి? ఈ ప్రశ్నలు ఉత్ప న్నమయ్యేలా మేకర్స్ ఈ టీజర్‌ని రూపొందించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: నిమిష్ రవి, సంగీతం: జి.వి. ప్రకాశ్ కుమార్.