యునైటెడ్ కింగ్డమ్లోని తెలుగు సమాజానికి సేవలందిస్తున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (టిఎఎల్), తన వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎమ్) 2026 అక్టోబర్ 10వ తేదీన బర్న్హామ్లోని బర్న్హామ్ గ్రామర్ స్కూల్లో విజయవంతంగా నిర్వహించింది.

ఈ సమావేశంలో ప్రస్తుత ధర్మకర్తల మండలి వార్షిక నివేదికలతో పాటు ఆర్థిక నివేదికలను సభ్యులకు సమర్పించింది. తమ పదవీకాలంలో టిఎఎల్ నిర్వహించిన వివిధ సాంస్కృతిక, సామాజిక, క్రీడా కార్యక్రమాల వివరాలను సభ్యులకు తెలియజేసింది.

పదవీకాలం ముగిసిన సందర్భంగా ప్రస్తుత అధ్యక్షులు రవి సబ్బా ధర్మకర్తల మండలి సభ్యులు, టిఎఎల్ అభివృద్ధికి నిరంతరం సహకరించిన అనిల్ అనంతుల, అశోక్ మడిశెట్టి, కిరణ్ కప్పేట, రవి మోచర్ల, సత్య పెదిరెడ్డి, వెంకట్ నీలా టిఎఎల్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ఎన్నికల అధికారి రాధా మనోహర్ మాచెర్ల ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన మండలికి అభినందనలు తెలిపిన ప్రస్తుత మండలి సభ్యులు, టిఎఎల్ భవిష్యత్తు అభివృద్ధి కోసం తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

నూతన ధర్మకర్తల మండలి సభ్యులు:
వంశీ మోహన్ సింగలూరి (ఛైర్మన్) గిరిధర్ పుట్లూరి (వైస్ ఛైర్మన్) చెంగలరాయం బొప్పన, సునీత అరిగె, సత్య పెద్దిరెడ్డి, వెంకట్ తోటకూర, లక్ష్మణ్ కోట .
కొత్త ఇన్చార్జ్ల నియామకం:
సాహిత్య విభాగం: శ్రీ రాజేష్ తోలేటి,
ఫండ్రైజింగ్: శ్రీ విజయ్ బెలిదే, శ్రీ సునీల్ అలపాటి,
సాంస్కృతిక విభాగం : ప్రశాంతి తిరునగరి
టీసీసీ: శ్రీరామ్ సురపనేని, సుభాష్ లోకసాని,
ఐటీ: శ్రీ రవి దేవనబోయిన, శ్రీ మురళి కోట
క్రీడలు : శ్రీమతి సింధూర చెరుకు, శ్రీ అనిల్ అనుగు

ఈ సమావేశంలో టిఎఎల్ వ్యవస్థాపక సభ్యులు, సలహాదారులు శ్రీధర్ వనం, డాక్టర్ రాములు దాసోజు తదితరులు నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రవాస తెలుగు సమాజం అభివృద్ధి కోసం, తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.నూతన ధర్మకర్తల మండలి తమపై విశ్వాసం ఉంచి, తెలుగు సమాజానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపింది.















