Namaste NRI

చైనాలో మితిమీరిన ఆంక్షలు… దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు

  ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కనుమరుగవుతున్న తరుణంలో కొవిడ్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్నా చైనాలో మాత్రం కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేసింది. కరోనా పేరుతో జిన్‌పింగ్‌ ప్రభుత్వం విధించిన మితిమీరిన ఆంక్షలపై జనం కన్నెరజేశారు.  వైరస్‌ కట్టడికి చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఇందులో భాగంగా జీవరో కొవిడ్‌ పాలసీని అమలు చేస్తూ లక్షల మంది ప్రజల్ని ఇంటికే పరిమితం చేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  షాంఘై నగరంలో వేల మంది చైనీయులు వీధుల్లోకి వచ్చి నిరనలు తెలుపుతున్నారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ను అంతం చేయాలని నినాదాలు చేశారు. ఆంక్షలకు వ్యతిరేకంగా ఖాళీ కాగితాలు, రాత్రిపూట మొబైల్‌ ఫోన్ల  ఫ్లాస్‌లైట్లను ప్రదర్శిస్తూ వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు.  పాలక కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా  (సీపీసీ)కి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అధ్యక్షుడు తప్పుకోవాలంటూ ముక్త కంఠంతో డిమాండ్‌ చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events