Skip to main content

Namaste NRI

మే 9న ఎఫ్3 ట్రైలర్

వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎఫ్‌ 3. తమన్నా, మెహరీన్‌,  సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే ప్రత్యేక పాటలో సందడి చేయనున్నారు.  ఈ నెల 9న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. టీజర్‌ను విడుదల చేయడం లేదు. నేరుగా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం. ఫన్‌ రైడ్‌ ట్రైలర్‌ను చూసేందుకు మరో వారం రోజులు ఎదరు చూస్తే చాలు అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభిస్తున్నది. ముఖ్యంగా ఎఫ్‌`3 థీమ్‌సాంగ్‌ ట్రెండిరగ్‌లో నిలిచింది. దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించిన ఎఫ్‌ 3 ఈ నెల 27న విడుదల కానుంది. రాజేంద్ర ప్రసాద్‌, సునీల్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: హర్షిత్‌ రెడ్డి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, కెమెరా: సాయి శ్రీరామ్‌, ఆర్ట్‌: ఏ.ఎస్‌.ప్రకాష్‌, నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌

Social Share Spread Message

Latest News