Skip to main content

Namaste NRI

రవితేజ పుట్టినరోజు సందర్భంగా రావణాసుర ఫస్ట్ గ్లింప్స్

మాస్ మహారాజా రవితేజ  హీరోగా నటిస్తోన్న మూవీ రావణాసుర. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటిస్తు న్నారు.  ఈ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ రవితేజ ఆర్ టి టీమ్వర్క్స్, అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో గ్రాండ్గా రూపొందుతోంది. సుశాంత్ కీలక పాత్ర  పోషిస్తున్నారు.

జనవరి 26న రవితేజ పుట్టినరోజు జరుపుకోనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక సందర్భంలో ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను లాయర్ పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా హై యాక్షన్ లో ప్రజంట్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్తో ఈ చిత్రాన్ని కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఏప్రిల్ 7, 2023న వేసవిలో రావణాసుర థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events