ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తున్న తాజా రొమాంటిక్ యాక్షన్ డ్రామాకు బేపర్వా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అహాన్ పాండే, షర్వరీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఫియర్లెస్ ఇన్ లవ్ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.

సైయారా చిత్రంతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అహాన్ పాండే ఈ సినిమాతో కెరీర్లో మరో భారీ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారు. ప్రేమ, సంగీతం, యాక్షన్ ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలిసింది. దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్‌కు యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో ఇది ఐదో సినిమా. గతంలో ఆయన ఈ సంస్థలో మేరే బ్రదర్ కీ దుల్హన్, గుండే, సుల్తాన్, టైగర్ జిందా హై వంటి చిత్రాలను తెరకెక్కించారు. వచ్చే ఏడాది మార్చి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.















