Skip to main content

Namaste NRI

బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ పృథ్వీరాజ్‌  నుంచి  ఫస్ట్‌ సింగిల్‌

బాలీవుడ్‌ అగ్రహీరో అక్షయ్‌కుమార్‌ నటిస్తున్న చిత్రం పృథ్వీరాజ్‌.  మానుషి ఛిల్లర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సంజయ్‌దత్‌, సోనూసూద్‌, అశుతోశ్‌ రాణా, మానవ్‌ విజ్‌, లలిత్‌ తివారీ ప్రధాన పాత్రలో నటించారు. ఢల్లీిని పరిపాలించిన చక్రవర్తి పృథ్వీరాజ్‌ చౌహాన్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మహమ్మద్‌ ఘోరీ దండయాత్రల నుంచి భారతదేశాన్ని కాపాడిన వీరయోధుడి పాత్రలో అక్షయ్‌ కుమార్‌ కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి హరి హర్‌ అనే అనే మొదటి గీతాన్ని అక్షయ్‌ కుమార్‌ విడుదల చేశారు. ఈ పాట తన హృదయాన్ని హత్తుకుందని, దేశభక్తి భావనలు ఉప్పొంగాయని అక్షయ్‌కుమార్‌ ఆనందం వ్యక్తం చేశారు.  ఈ పాట పృథ్వీరాజ్‌ దైర్యాన్ని, మహా సంకల్పాన్ని ప్రతిబింబిస్తుది. తొలిసారి విన్నప్పుడే ఈ పాటతో ప్రేమలో పడిపోయా అని అక్షయ్‌ కుమార్‌చెప్పారు. చంద్రప్రకాష్‌ ద్వివేది దర్శకత్వంలో రూపొందిది. ఈ చిత్రం జూన్‌ 3న హిందీ, తమిళంతో పాటు తెలుగులో  ప్రపంచ వ్యాప్తంగా  విడుదల కానుంది. ఈ చిత్రాన్ని యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events