Namaste NRI

సందీప్ కిషన్ సిగ్మా నుంచి ఫస్ట్ సింగిల్

సందీప్‌కిషన్‌ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సిగ్మా. తమిళనాడు సీఎం దళపతి విజయ్‌ కుమారుడు జేసన్‌ సంజయ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ మొదలుపెట్టారు. ఈ సినిమాలోని సిగ్మా స్టైల్‌ అనే తొలి గీతాన్ని అగ్ర హీరో దుల్కర్‌ సల్మాన్‌ విడుదల చేశారు. తమన్‌ మ్యూజిక్‌ అందించడంతో పాటు ఈ గీతాన్ని ఆలపించారు. ఫాస్ట్‌బీట్‌తో మాస్‌ నెంబర్‌గా ఈ పాట సాగింది. సందీప్‌కిషన్‌, ఫరియా అబ్దుల్లా డ్యాన్స్‌ ప్రత్యేకాకర్షణగా నిలిచింది. జూలై 31న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events